భారతదేశం, ఫిబ్రవరి 5 -- వరంగల్ - కరీంనగర్ పట్టణాల సమగ్రాభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృహత్ ప్రణాళికను ప్రకటించారు. ఈ రెండు పట్టణాలకు ఔటర్ రింగ్‌ రోడ్లను పూర్తి చేస్తామన్నారు. ఆ రెండింటినీ కలుపే విధంగా రోడ్లను విస్తరించడమే కాకుండా రెండింటి మధ్య అతి పెద్ద డంప్‌ యార్డ్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. డంప్ యార్డ్ వద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తామని వెల్లడించారు.

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్‌లో నిర్వహించిన "ప్రజాపాలన - ప్రగతి బాట" కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చొప్పదండిలో రూ. 45.15 కోట్లతో నిర్మించనున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)కి. అలాగే రూ. 5 కోట్లతో గంగాధర మండలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

మరోవైపు బీఆర్ఎస్, బీజేప...