Hyderabad, జూలై 17 -- నిక్ జోనస్, ప్రియాంకా చోప్రాల రొమాంటిక్ హాలిడే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీడియోలో.. ఈ సింగర్ తన భార్య ప్రియాంకతో కలిసి అందమైన బీచ్ వెకేషన్‌ను ఆస్వాదిస్తూ కనిపించాడు. ఈ వీడియోలో ఈ జంట ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ కనిపించడంతో, అభిమానులు వారి కెమిస్ట్రీ చూసి మురిసిపోతున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి ఎస్ఎస్ఎంబీ 29లో నటిస్తున్న ప్రియాంకా చోప్రా ఇప్పుడు భర్త నిక్ జోనస్ తో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా జోనస్ బ్రదర్స్ కొత్త మ్యూజిక్ ను ప్రమోట్ చేస్తూ 32 ఏళ్ల సింగర్, నటుడు నిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకున్నాడు. అందులో అతను ప్రియాంక (42)తో కలిసి బీచ్‌లో సరదాగా గడుపుతూ, పీడీఏ (పబ్లిక్ డిస్‌ప్లే ఆఫ్ అఫెక్షన్) చేస్తూ కనిపించాడు.

ఈ వీడియో జోనస్ బ్రదర్స...