భారతదేశం, జనవరి 31 -- సాధారణంగా మన వద్ద లేని వస్తువులను ఇతరుల నుంచి తీసుకుంటూ ఉంటాము. కానీ కొన్ని వస్తువులను ఇతరుల నుంచి తీసుకోవడం మంచిది కాదు. ఈ వస్తువులను ఇతరుల నుంచి తీసుకోవడం వలన సమస్యలు ఎక్కువవుతాయి. కాబట్టి ఎప్పుడైనా ఈ వస్తువులను ఇతరుల దగ్గర నుంచి తీసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించి ఏం చేయాలో నిర్ణయించుకోండి.

చీపురును ఎప్పుడూ కూడా ఇతరుల దగ్గర నుంచి తీసుకోకూడదు. అలా తీసుకున్నట్లయితే ధనవ్యయం, స్థిరత్వ లోపంతో బాధపడాల్సి ఉంటుంది.

ఎవరి దగ్గర నుంచి కూడా అద్దాన్ని తీసుకోకూడదు. అద్దాన్ని తీసుకున్నట్లయితే అదృష్టం తగ్గిపోతుంది అని చెబుతారు. కాబట్టి అద్దాన్ని కూడా ఇతరుల నుంచి తీసుకోవడం మంచిది కాదు.

అలాగే ఇతరుల దగ్గర నుంచి నగలను తీసుకోకూడదు. అలా చేసినట్లయితే గ్రహబాధలు, మనశ్శాంతి లోపం వంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఎప్పుడూ కూడా ఇతరుల దగ్గర నుంచి ...