భారతదేశం, ఆగస్టు 23 -- డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్) పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ఈరోజు (ఆగస్టు 23, 2025) ముగించనుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్ rectt.bsf.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా వివిధ ట్రేడ్స్‌లో మొత్తం 3,588 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అర్హత: బీఎస్​ఎఫ్​ కానిస్టేబుల్​ రిక్రూట్​మెంట్​ 2025కి అప్లై చేస్తున్న అభ్యర్థులు.. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థి వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

అభ్యర్థులను పలు అంచెల ఎంపిక ప్రక్రియ ద్వారా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అవి:

ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్: శారీరక ప్...