Hyderabad, ఏప్రిల్ 28 -- బాహుబలి.. ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయే సినిమా. తెలుగు సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లిన ఈ సినిమా పదేళ్లు పూర్తి చేసుకుంది. దర్శక ధీరుడు రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ.. ఈ ఏడాది అక్టోబర్ లో రీరిలీజ్ కానున్నట్లు నిర్మాత శోభు యార్లగడ్డ వెల్లడించాడు.

ఎస్ఎస్ రాజమౌళి మ్యాగ్నమ్ ఓపస్ బాహుబలి మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. 2015లో రిలీజైన ఈ మూవీ పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శోభు యార్లగడ్డ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రీరిలీజ్ ప్లాన్స్ గురించి తెలిపాడు. "అద్భుతానికి పదేళ్లు. ఈ ప్రత్యేకమైన రోజున ఈ బాహుబలి మూవీని ఈ ఏడాది అక్టోబర్ లో ఇండియాతోపాటు అంతర్జాతీయంగా రీరిలీజ్ చేయబోతున్నామని చెప్పడానికి చాలా థ్రిల్లింగా ఉంది.

ఇది కేవలం రీరిలీజ్ మాత్రమే కాదు. మా ప్రియమైన అభిమానులకు ఇది సంబరాల ఏడాది....