భారతదేశం, సెప్టెంబర్ 20 -- ఆర్థికంగా వెనకబడిన బాలికలు కాలేజీ విద్యను అభ్యసించడానికి అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్.. అజీమ్ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్ 2025 కి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ స్కాలర్‌షిప్ కింద అర్హత ఉన్న విద్యార్థినులకు ఏడాదికి రూ. 30,000 ఆర్థిక సాయం అందిస్తారు.

ఈ స్కాలర్‌షిప్‌ను విద్యార్థులు వారు చదువుకుంటున్న మొదటి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా కోర్సు మొత్తం కాలానికి ఇస్తారు.

ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కింది అర్హతలను కలిగి ఉండాలి:

దరఖాస్తు చేసుకునేవారు అర్హత ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాల లేదా కళాశాల నుంచి 10వ తరగతి, 12వ తరగతి రెండింటినీ రెగ్యులర్ విద్యార్థిగా పాస్ అయి ఉండాలి.

దేశంలో ఎక్కడైనా ఒక గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ కాలేజీ లేదా యూనివర్సిటీలో మొదటి సంవత్సరం (...