భారతదేశం, ఫిబ్రవరి 6 -- బుల్లితెర మెగాస్టార్‌గా ప్రభాకర్ ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆయన కుమారుడుగా సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన చంద్రహాస్ యాటిట్యూడ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన లేటెస్ట్ మూవీ బరాబర్ ప్రేమిస్తా.

టాలీవుడ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ రొమాంటిక్ లవ్ కామెడీ స్టోరీగా తెరకెక్కిన బరాబర్ ప్రేమిస్తా సినిమాలో చంద్రహాస్‌కు జోడీగా మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు సంపత్ రుద్ర దర్శకత్వం వహించగా.. గేద చందు, గాయత్రి చిన్ని, వెంకటేశ్వేరరావు నిర్మించారు.

అలాగే, బరాబర్ ప్రేమిస్తా మూవీలో మురళిధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, అర్జున్ మహి, అభయ్ నవీన్, సునిత మనోహర్, కీర్తి లత తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఇవాళ (ఫిబ్రవరి 6) థియేటర్లలో బరాబర్ ప్రేమిస్తా సినిమా విడుదల అయింది. మరి ఈ...