భారతదేశం, ఫిబ్రవరి 1 -- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్ 2026ను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందే పసిడి మార్కెట్ గందరగోళంలో పడింది. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. ఆదివారం ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో ఈ విలువైన లోహాల ధరలు లోయర్ సర్క్యూట్ స్థాయికి పడిపోవడం గమనార్హం.

బంగారం ధరలో భారీ కోత శనివారం కమొడిటీ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 5.4 శాతం మేర క్షీణించి, 10 గ్రాములకు రూ. 1,69,470 వద్ద ముగిసింది. అయితే, ఈ పతనం అక్కడితో ఆగలేదు. తాజాగా మరో రూ. 3,500 తగ్గి రూ. 1,65,500 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర 9 శాతం పైగా క్షీణించి ఔన్స్‌కు 4,887 డాలర్లకు చేరుకుంది.

కేవలం గత గురువారం నాడ...