భారతదేశం, జనవరి 30 -- బులియన్ మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేరోజు భారీ పతనం నమోదైంది. శుక్రవారం మధ్యాహ్నం ట్రేడింగ్ సమయానికి బంగారం, వెండి ధరలు కుప్పకూలడంతో మదుపర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పుడు 4 శాతం తగ్గుదల కనిపించినప్పటికీ, మధ్యాహ్నానికి భారీగా పడిపోయాయి.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 9 శాతం మేర క్షీణించాయి. అంటే 10 గ్రాముల బంగారంపై సుమారు రూ. 15,000 తగ్గుతూ రూ. 1,54,157 వద్దకు చేరింది. గతంలో నమోదైన ఆల్-టైమ్ గరిష్ట ధరలతో పోలిస్తే, పసిడి ఇప్పుడు ఏకంగా రూ. 26,600 (సుమారు 14.7 శాతం) మేర పతనం కావడం గమనార్హం.

వెండి ధరల పతనం పసిడి కంటే తీవ్రంగా ఉంది. ఎంసీఎక్స్‌లో వెండి ధర ఏకంగా 15 శాతం కుప్పకూలింది. ఒక్కరోజే కిలో వెండిపై సుమారు రూ. 60,000 మేర తగ్గడంతో ధర రూ. 3,39,910 వద్...