భారతదేశం, ఏప్రిల్ 22 -- ఫ్లాష్​! ఫ్లాష్​! గత కొన్ని నెలలుగా విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయిని తాకాయి. దేశంలో 10 గ్రాముల (24 క్యారెట్​) బంగారం ధర రూ. 1లక్ష మార్క్​ని మంగళవారం హిట్​ చేసింది.

ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్​ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి నుంచి తొలగిస్తారన్న భయాల మధ్య ఇన్వెస్టర్లు ఆ దేశ స్టాక్స్, బాండ్లు, డాలర్ నుంచి వైదొలిగే అవకాశం ఉన్న అనిశ్చితి వేళ బంగారంలోకి పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఫలితంగా గోల్డ్​ ప్రైజ్​ పెరిగి ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది.

ఏప్రిల్​ 30, అక్షయ తృతీయకు ముందు బంగారం ధర రూ. 1లక్ష తాకడం భారతదేశ మధ్యతరగతిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు చాలా మంది పసిడిలో పెట్టుబడి పెట్టడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది.

Published by HT Digital Content Services with permissio...