భారతదేశం, జనవరి 31 -- ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే ఓసారి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన సిట్. మరోసారి కూడా జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీన విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఎర్రవెల్లిలో కాకుండా నందినగర్ నివాసంలోనే విచారిస్తామని పేర్కొంది. ఈ మేరకు కేసీఆర్ నివాసంలో నోటీసులను అతికించారు.

ఈ నోటీసులను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. మొదటిసారి ఇచ్చిన సిట్ నోటీసులపై కేసీఆర్ రిప్లే ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమయం ఇవ్వాలని కోరారని చెబుతున్నారు. కానీ సమయం ఇవ్వకుండా వెంటనే విచారణకు హాజరుకావాలని చెప్పటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1(ఆదివారం)వ తేదీన రాష్ట్రవ్యాప్తం...