భారతదేశం, ఫిబ్రవరి 1 -- సిట్ నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. సిట్ అధికారులు వ్యవహరించిన తీరు చట్టాలకి వ్యతిరేకమన్నారు. సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ. కీలక అంశాలను ప్రస్తావించారు. సిట్ అధికారులకి నోటీసు ఇచ్చే అధికారమే లేదని.. నా రాజ్యాంగ హక్కులను కాలరాయడమే అని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సిట్ కు ఓ లేఖను పంపారు.

"మీరు ఇచ్చిన మొదటి నోటీసుకు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉండటం వల్ల వేరే రోజు విచారణకు తేదీ ఇవ్వాలని చెప్పాను. దాంతో పాటు 65 ఏళ్ల పైబడిన వ్యక్తులను వారు నివసించే చోటనే విచారించాలని చెప్పే సెక్షన్ 160 CrPC నిబంధనలను మీ దృష్టికి తెచ్చాను. దాంతో పాటు తదుపరి నోటీసులన్నీ కూడా ఎర్రవల్లిలోని నా నివాసానికే పంపాలని చెప్పాను. కానీ, ఇది చెప్పిన తర్వాత కూడా గుర్తుతెలియని వ్యక్తులు మీ సంతకంతో ఉన్న లేఖను రాత్రి 9 గ...