భారతదేశం, మే 11 -- తమిళ వెబ్ సిరీస్ 'హార్ట్ బీట్' గతేడాది చాలా సక్సెస్ అయింది. ఈ మెడికల్ కామెడీ డ్రామా సిరీస్‍లో దీపా బాలు, అనుమోల్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగులోనూ ఈ సిరీస్ వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్‍కు రెండో సీజన్ వచ్చేస్తోంది. హార్ట్ బీట్ సీజన్ 2 సిరీస్ స్ట్రీమింగ్ స్టార్టింగ్ డేట్ ఖరారైంది.

హార్ట్ బీట్ సీజన్ 2 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మే 22వ తేదీన జియోహాట్‍స్టార్ ఓటీటీలో మొదలుకానుంది. ఆరోజు నుంచి ఈ సిరీస్‍లో ఎపిసోడ్లు వస్తాయి. "బీట్ కోసం నిరీక్షణ ముగిసింది. మే 22 ఈ డేట్‍ను సేవ్ చేసుకోండి. హార్ట్ బీట్ సీజన్ 2 మే 22వ తేదీ నుంచి జియో హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది జియో హాట్‍స్టార్.

హార్ట్ బీట్ వెబ్ సిరీస్ ఆర్కే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సాగుతుంది. ఆ ఆసుపత్రికి ఇంటెర్న్ డాక్టర్లుగా వచ్చే ...