Hyderabad, సెప్టెంబర్ 10 -- అఖిల్ అక్కినేని 2017లో నటించిన 'హలో' సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నటి కల్యాణి ప్రియదర్శన్ తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంది. ఆచితూచి ప్రాజెక్టులను ఎంపిక చేసుకుంటోంది. ఆ ఫలితమే ఇప్పుడామెకు ఓ అరుదైన ఘనతను సొంతం చేసింది. డొమినిక్ అరుణ్ డైరెక్ట్ చేసిన 'లోకా ఛాప్టర్ 1 - చంద్ర' సినిమాతో.. ఆమె ఇండియాలో మొదటి మహిళా సూపర్ హీరోనే కాకుండా మలయాళంలో రూ.200 కోట్లు సాధించిన మొదటి మహిళా నటిగా కూడా నిలిచింది.

బాక్సాఫీస్ దగ్గర భారీగా వసూళ్లు అలవాటు లేని మలయాళ సినిమా.. చాలా రీసెంట్‌గా అంటే గతేడాదే రూ.200 కోట్ల మార్క్‌ని క్రాక్ చేసింది. ఈ ఏడాది మోహన్‌లాల్ సినిమాలు 'ఎల్2 ఎంపూరాన్' (రూ.265.5 కోట్లు) 'తుడరుమ్' (రూ.234.5 కోట్లు), 2024లో వచ్చిన సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి సినిమా 'మంజుమ్మెల్ బాయ్స్' (రూ.240.5 కోట్లు)తో ఇది ...