భారతదేశం, ఫిబ్రవరి 5 -- ప్రతి ఏటా సూర్య గ్రహణాలు, చంద్ర గ్రహణాలు రావడం చూస్తూ ఉంటాం. 2026 ప్రారంభమైంది, అప్పుడే జనవరి నెల కూడా పూర్తయిపోయింది. అయితే ఫిబ్రవరిలో మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. 2026 లో మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడిపోతుంది.

ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకమైనది. ఫిబ్రవరి నెలలో వాలెంటైన్స్ డే ని జరుపుకోవడంతో పాటు మహాశివరాత్రి పర్వదినాన్ని కూడా జరుపుకుంటాము. శివరాత్రి నాడు శివభక్తులందరూ శివుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఉపవాసం, జాగరణ వంటి పద్ధతులను పాటిస్తారు. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సూర్యగ్రహణం కూడా రాబోతోంది.

2026 లో వచ్చే మొదటి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న రాబోతోంది. ఫిబ్రవరి 17 సాయంత్రం 5:31 కి ఇది ప్రారంభమవుతుంది, రాత్రి 7:50 కి ముగుస్తుంది. అయితే భారతదేశంలో కనిపించినప్పుడు మాత్రమే సూతక కాలం పరిగణించబడుతుంది. ఈ గ్రహ...