భారతదేశం, ఆగస్టు 14 -- దేశంలో రహదారి ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు తలపెట్టిన ఫాస్టాగ్​ వార్షిక పాస్​ ఆగస్ట్​ 15న అందుబాటులోకి రానుంది. దీని ద్వారా ఏడాదికి ఒకేసారి రూ. 3,000 చెల్లించి జాతీయ రహదారులపై అపరిమితంగా ప్రయాణించవచ్చు!

సాధారణ ఫాస్టాగ్ రీఛార్జి విధానంలో బ్యాలెన్స్ అయిపోయినప్పుడు మళ్లీ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ వార్షిక పాస్‌తో ఏడాది పాటుగానీ లేదా 200 టోల్ క్రాసింగ్‌లు పూర్తయ్యే వరకు గానీ, వీటిలో ఏది ముందైతే అది వర్తిస్తుంది. ఇది తరచూ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పాస్‌తో ఏడాది పొడవునా అదనపు రీఛార్జీలు లేకుండా జాతీయ రహదారులపై అపరిమితంగా ప్రయాణించవచ్చు.

అంతేకాకుండా.. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం డిస్టెన్స్-బేస్డ్ ప్రైసింగ్ మోడల్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంలో ప్రయ...