భారతదేశం, మే 11 -- టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన 'సింగిల్' మూవీ.. ట్రైలర్‌ తర్వాత మంచి హైప్ తెచ్చుకుంది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఈ శుక్రవారం మే 9వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు ఎక్కువగా పాజిటివ్ టాక్ వచ్చింది. మంచి ఓపెనింగ్ దక్కింది. రెండో రోజు ఈ మూవీ మరింత సత్తాచాటింది. ఫస్ట్ డేతో పోలిస్తే వసూళ్లలో గ్రోత్ దక్కించుకుంది.

సింగిల్ చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.11.2కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆ మూవీ టీమ్ నేడు (మే 11) అధికారికంగా వెల్లడించింది. తక్కువ బడ్జెట్‍తోనే రూపొందిన ఈ మూవీ మంచి హిట్ దిశగా దూసుకెళుతోంది.

సింగిల్ సినిమా తొలి రోజు రూ.4.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సొంతం చేసుకున్నట్టు మూవీ టీమ్ వెల్లడించింది. దీన్నిబట్టి రెండో రోజు ఈ సినిమా రూ.7.05 కోట్లను దక్కించుకుంది. తొలి రోజుతో ...