భారతదేశం, ఫిబ్రవరి 10 -- ప్రైమ్ వీడియోలో వచ్చిన టాప్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఫర్జీ' మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకులు రాజ్ & డీకే అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. సీజన్ 2 పనులు మొదలైనట్లు అధికారికంగా ప్రకటించారు. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సీక్వెల్ షూటింగ్, కథా విశేషాలు ఇక్కడ చూడండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో సంచలనం సృష్టించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఫర్జీ' (Farzi). 2023లో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సిరీస్ అత్యధిక మంది చూసిన ఇండియన్ వెబ్ సిరీస్‌గా రికార్డు సృష్టించింది. సరిగ్గా మూడేళ్ల తర్వాత అంటే మంగళవారం (ఫిబ్రవరి 10, 2026) సిరీస్ వార్షికోత్సవం సందర్భంగా దర్శకులు రాజ్ & డీకే ఫ్యాన్స్‌కు ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు.

తమ అధికారిక 'ఎక్స్' ఖాతాలో రాజ్ & డీకే ఒక ఆసక్తికరమైన ఫోటోను షేర్ చేశారు. నకిలీ న...