Hyderabad, జూన్ 9 -- ప్రైమ్ వీడియో ఓటీటీ ఇండియాలో ఈ వారం టాప్ 10 ట్రెండింగ్ సినిమాల లిస్ట్ వచ్చేసింది. కొన్ని వారాలుగా సత్తా చాటుతున్న తెలుగు సినిమాలు ఈ తాజా జాబితాలోనూ తమ ఉనికిని చాటుకున్నాయి. ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చిన సింగిల్ మూవీతోపాటు పెళ్లికాని ప్రసాద్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఓదెల 2, సారంగపాణి జాతకంలాంటి సినిమాలు ఈ లిస్టులో ఉండటం విశేషం.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో సోమవారం (జూన్ 9) ట్రెండింగ్ సినిమాల లిస్ట్ చూస్తే.. తొలి స్థానంలో హిందీ కామెడీ మూవీ భూల్ చుక్ మాఫ్ (Bhool Chuk Maaf) ఉంది. థియేటర్లలో రిలీజైన 15 రోజులకే ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ సినిమాకు ప్రైమ్ వీడియోలో మంచి ఆదరణ లభిస్తోంది. నవ్వులు పూయిస్తుండటంతోపాటు చివర్లో ఓ మంచి సందేశాన్ని కూడా ఇచ్చిన ఈ భూల్ చుక్ మాఫ్ సినిమాకు ఐఎండీబీలో 6.3 రేటింగ్ ఉంది.

ఇక రెండో స్థానంలో తెలు...