Hyderabad, మే 6 -- మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఇప్పుడు తెలుగులోనూ మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు ప్రతి ఓటీటీ ఆ ఇండస్ట్రీ సినిమాల కోసం పోటీ పడుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ అలాంటి మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో బెస్ట్ మూవీస్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

కూమన్ 2022లో వచ్చిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దృశ్యం మూవీ ఫేమ్ జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఆసిఫ్ అలీ నటించాడు. ఇది ఓ కఠినమైన పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథ. అతడు ఓ మారుమూల గ్రామానికి వెళ్లి సెటిలవుతాడు. అయితే అతని గతం వల్ల అతనితోపాటు చుట్టూ ఉన్న వారికి కూడా ప్రమాదం తలెత్తుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ మూవీలో చూడొచ్చు.

జోసెఫ్ 2018లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా. జోజు జార్జ్ లీడ్ రోల్లో నటించాడు. ఇన్వెస్టిగేషన్ లో దిట్ట అని పేరు పొంద...