Hyderabad, జూన్ 5 -- అమెజాన్ ప్రైమ్ వీడియోలో బుధవారం (జూన్ 4) ఓ హిందీ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ మూవీ పేరు స్టోలెన్ (Stolen). ఈ సూపర్ థ్రిల్లర్ ఆ ఓటీటీలో టాప్ ట్రెండింగ్ సినిమాగా నిలిచింది. ఓ చిన్న పాప కిడ్నాప్, అందులో అనుకోకుండా ఇరుక్కునే ఇద్దరు అన్నదమ్ముల చుట్టూ తిరిగే ఈ మూవీ ఎలా ఉందో చూడండి.

ప్రైమ్ వీడియో ఓటీటీలో ఉన్న స్టోలెన్ మూవీ కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ మూవీ మొదట్లోనే ఓ ఆదివాసీ మహిళకు చెందిన ఓ చిన్న పాపను కిడ్నాప్ చేయడం చూడొచ్చు. రాజస్థాన్ లోని ఓ చిన్న ఊళ్లో ఓ రాత్రి రైల్వేస్టేషన్ లో నిద్రిస్తున్న ఆమె పక్కనే ఉన్న చిన్నారిని ఓ మహిళ ఎత్తుకుపోతుంది. ఈ క్రమంలో అప్పుడే రైలు దిగి తన సోదరుడి కోసం ఎదురు చూస్తున్న రమణ్ (శుభం వర్ధన్)ను ఢీకొట్టుకుంటూ వెళ్తుంది.

అతన్ని తీసుకెళ్లడానికి స్టేషన్ కు అతని అన్న...