Hyderabad, అక్టోబర్ 10 -- ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఓటీటీలోకి నిర్మాతగా అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాడు. ముంబై నేపథ్యంలో రూపొందే 'స్టార్మ్' అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోసం హృతిక్.. ప్రైమ్ వీడియో తో కలిసి పనిచేస్తున్నట్లు శుక్రవారం (అక్టోబర్ 10) అనౌన్స్ చేశాడు. ఇది హృతిక్ రోషన్, అతని బ్యానర్ అయిన హెచ్‌ఆర్ఎక్స్ ఫిల్మ్స్ మధ్య సహకారంతో నిర్మిస్తున్న వెబ్ సిరీస్.

అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రానున్న ఈ వెబ్ సిరీస్‌ను అజిత్‌పాల్ సింగ్ క్రియేట్ చేసి డైరెక్ట్ చేస్తున్నాడు. కథను అజిత్‌పాల్ సింగ్, ఫ్రాంకోయిస్ లూనెల్, స్వాతి దాస్ రాశారు. ప్రముఖ మలయాళ నటి పార్వతి తిరువోతుతోపాటు అలయ ఎఫ్, సృష్టి శ్రీవాస్తవ, రమా శర్మ, సబా ఆజాద్ ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'స్టార్మ్' అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతానికి ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తు...