Hyderabad, జూన్ 18 -- నవీన్ చంద్ర.. ఎప్పుడో అందాల రాక్షసి మూవీతో పాపులర్ అయిన నటుడు. ఈ మధ్యే ఈ మూవీ రీరిలీజ్ కూడా అయింది. అదే సమయంలో అతడు నటించిన రెండు సినిమాలు లెవెన్ (Eleven), బ్లైండ్ స్పాట్ (Blind Spot) సినిమాలు ప్రైమ్ వీడియోలో దూసుకెళ్తున్నాయి. టాప్ 3 ట్రెండింగ్ సినిమాల జాబితాలో ఈ రెండూ ఉండటం విశేషం.

అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఈ మధ్యే నవీన్ చంద్ర నటించిన రెండు సినిమాలు అడుగుపెట్టాయి. అందులో ఒకటి లెవెన్ కాగా.. మరొకటి బ్లైండ్ స్పాట్. వీటిలో లెవెన్ మూవీ తెలుగు సహా వివిధ భాషల్లో వచ్చింది. తమిళ వెర్షన్ అయితే ప్రస్తుతం ట్రెండింగ్ సినిమాల్లో తొలి స్థానంలో ఉండటం విశేషం. ఇక ఇదే మూవీ తెలుగు వెర్షన్ ఐదో స్థానంలో ఉంది.

మరోవైపు బ్లైండ్ స్పాట్ మూవీ మూడో స్థానంలో ఉంది. ఇదో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా. ఓ గృహిణి సూసైడ్ కేసు మర్డర్‌ అని పస...