భారతదేశం, ఫిబ్రవరి 18 -- మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలకలం రేపిన ఎంబీఏ విద్యార్థిని హత్య కేసులో నిందితుడు పీయూష్ ధామ్నోడియా నోరు విప్పాడు. పోలీసుల విచారణలో అతను చెప్పిన విషయాలు వింటుంటే సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ప్రేమ, పెళ్లి, అనుమానం.. ఈ మూడింటి చుట్టూ తిరిగిన ఈ కథ చివరకు ఒక యువతి ప్రాణం తీయడమే కాకుండా, మరణం తర్వాత కూడా ఆమెకు అవమానాన్నే మిగిల్చింది.

మందసౌర్‌కు చెందిన పీయూష్, బాధితురాలు ఒకే కాలేజీలో ఎంబీఏ చదువుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పీయూష్ ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నా, ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో జనవరిలో తన రూమ్‌లోనే ఆమె మెడలో మంగళసూత్రం కట్టి, రహస్యంగా ఏడు అడుగులు వేసినట్లు పీయూష్ పోలీసులకు తెలిపాడు. అయితే, "ఈ రహస్య పెళ్లి నాకు వద్దు, అందరి ముందూ నన్ను భార్యగా అంగీకరించు" అని...