భారతదేశం, మే 20 -- విజయవాడ బెంగుళూరు మధ్య వందే భారత్ సర్వీస్ త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌-విశాఖపట్నం మధ్య విజయవాడ మీదుగా రెండు వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలోనే విజయవాడ నుంచి బెంగుళూరుకు మరో సర్వీసును ప్రారంభించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది.

విజయ వాడ-బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ పట్టాలెక్కనుంది. విజయవాడ నుంచి బెంగుళూరు వైపు పరిమిత సంఖ్యలో రైళ్లు ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.విజయవాడ నుంచి ప్రస్తుతం ‍యశ్వంతపూర్‌ రైలు మాత్రమే బెంగుళూరుకు ఉంది. దీంతో ప్రైవేట్‌ ట్రావెల్ బస్సులు ఫుల్‌ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఈ మార్గంలో కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని చాలా కాలంగా డిమాండ్‌ ఉంది. కొత్త రైలును తిరుపతి మీదగా బెంగుళూరుకు నడుపుతారు.

వందేభారత్‌ సిరీస్ రైళ్లు మొదలైన తర్వాత విజయవాడ- బెంగుళూరు ...