భారతదేశం, ఆగస్టు 11 -- బెంగుళూరులో కొత్తగా ప్రారంభించిన యెల్లో మెట్రో లైన్ సేవలు సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన ఈ మెట్రో, నగరంలో ట్రాఫిక్​ సమస్యలను తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఈ మెట్రో మార్గం ఆర్‌వీ రోడ్డు నుంచి బొమ్మసంద్ర వరకు 16 స్టేషన్లను కలుపుతుంది. నమ్మ మెట్రో యెల్లో లైన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ చూడండి..

బెంగళూరు మెట్రో యెల్లో లైన్​ సేవలు సోమవారం, ఆగస్టు 11న ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. కొత్తగా ప్రారంభించిన ఈ యెల్లో లైన్ మొత్తం 19 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇది బెంగుళూరు దక్షిణ ప్రాంతంలోని ఆర్‌వీ రోడ్డును, నగరంలోని పారిశ్రామిక ప్రాంతమైన బొమ్మసంద్రతో కలుపుతుంది. ఈ మార్గంలో మొత్తం 16 స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ఆర్‌వీ రోడ్డు, జయదేవ, సెంట్రల్ సిల్క్ బోర్డ...