భారతదేశం, జూలై 11 -- ప్రముఖ పాకిస్థానీ నటి హుమైరా అస్ఘర్ అలీ మరణవార్త ఆ దేశంలో సంచలనం సృష్టిస్తోంది! అస్ఘర్​ అలీ మృతదేహం ఇటీవలే బయటపడగా.. ఆమె గతేడాది అక్టోబర్​లో మరణించిన ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

లాహోర్‌కు చెందిన హుమైరా అస్ఘర్ అలీ 2015లో వినోద పరిశ్రమలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆమె "జస్ట్ మ్యారీడ్," "ఎహసాన్ ఫరామోష్," "గురు," "చల్ దిల్ మేరే" వంటి పలు టెలివిజన్ షోలలో సహాయక పాత్రలు పోషించారు. ఇక సినిమాల విషయానికొస్తే, ఆమె "జలైబీ (2015)", "లవ్ వ్యాక్సిన్ (2021)" వంటి చిత్రాలలో నటించింది.

2022లో ఏఆర్​వై డిజిటల్‌లో ప్రసారమైన రియాలిటీ షో "తమాషా ఘర్" లో చేరడంతో ఆమెకు మరింత గుర్తింపు లభించింది. 2023లో జరిగిన నేషనల్ ఉమెన్ లీడర్‌షిప్ అవార్డ్స్‌లో ఉత్తమ వర్ధమాన ప్రతిభ- రైజింగ్ స్టార్ అవార్డును కూడా అందుకున్నారు.

పాకిస్థానీ నటి హ...