భారతదేశం, మే 26 -- పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ది రాజాసాబ్' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ చిత్రం విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. ఏప్రిల్‍లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఈ రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అప్‍డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, రాజాసాబ్ రిలీజ్ ఇదేనంటూ తాజాగా రూమర్లు బయటికి వచ్చాయి.

ది రాజాసాబ్ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల కానుందంటూ తాజాగా రూమర్లు బయటికి వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ తేదీ చక్కర్లు కొడుతోంది. డిసెంబర్ 5నే మూవీ టీమ్ ఆలోచిస్తోందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీనే ది రాజాసాబ్ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ముందుగా ప్రకట...