Hyderabad, సెప్టెంబర్ 29 -- మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఇంకా సంజయ్ దత్ నటించిన 'ది రాజా సాబ్' సినిమా మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ సోమవారం (సెప్టెంబర్ 29) సాయంత్రం రిలీజ్ అయింది. ఈ హారర్ కామెడీ సినిమాలో ప్రభాస్ ఒక యంగ్ మ్యాన్, ఒక వృద్ధుడి పాత్రలలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ట్రైలర్ మూవీపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది.

ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో ఇండియాలోనే బిగ్గెస్ట్ హారర్ కామెడీ మూవీగా చెబుతూ ది రాజా సాబ్ మూవీ వస్తోంది. సంక్రాంతికి రిలీజ్ ఉన్నా.. సుమారు రెండున్నర నెలల ముందే ట్రైలర్ రిలీజ్ చేయడం విశేషం. ట్రైలర్ మొదట్లో ప్రభాస్ ఒక హిప్నోటిస్ట్ ఆఫీస్‌లో కూర్చుని ఉంటాడు. అక్కడ అతను తన వాయిస్ మీద ఫోకస్ చేయమని అడుగుతారు. బ్యాక్‌గ్రౌండ్‌లో బప్పీ లహరి, ఉషా ఉతుప్ ఫేమస్ సాంగ్ 'కోయి...