భారతదేశం, జూన్ 27 -- ఈ రోజు విడుదలైన కన్నప్ప సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు వంటి మహామహులు నటించారు. వారు ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యూరనేషన్ ఎంత అనే విషయంలో ఆసక్తి నెలకొన్నది.

కన్నప్ప విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం జూన్ 27న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా బావుందని, మంచు విష్ణు, ప్రభాస్ లు ఈ సినిమాను వేరే లెవెల్ కు తీసుకువెళ్లారని టాక్ వస్తోంది.

సాధారణంగా స్టార్స్ నటించి సినిమాల్లో వారి రెమ్యూనరేషన్ ఎంత ఉంటుందనే విషయంలో ప్రేక్షకులకు ఆసక్తి ఉంటుంది. మరి కన్నప్ప సినిమా కోసం ఎవరు ఎంత తీసుకున్నారో తెలుసుకుందాం.

అక్షయ్ కుమార...