భారతదేశం, అక్టోబర్ 29 -- పాపులర్ కొరియన్ మూవీ 'ట్రైన్ టు బుసాన్', మార్వెల్ మూవీ 'ఎటర్నల్స్' వంటి వాటిలో నటించి అంతర్జాతీయ ప్రేక్షకులకు దగ్గరైన కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ. ఇప్పుడతడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా మన ప్రభాస్ సినిమాతో కావడం విశేసం. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సందీప్ రెడ్డి వంగా మూవీ 'స్పిరిట్'లో డాన్ లీ విలన్ పాత్ర పోషించనున్నట్లు కొరియా మీడియా రిపోర్ట్ చేసింది.

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ నుంచి ఈ మధ్యే ఓ చిన్న గ్లింప్స్ రూపంలో అప్డేట్ వచ్చిన విషయం తెలుసు కదా. వెంటనే ఈ మూవీలో విలన్ పాత్ర అంటూ కొరియన్ మీడియా రిపోర్ట్ చేయడం విశేషం. కొరియన్ డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్ కమ్యూనిటీ అయిన ముకో (Muko) మంగళవారం (అక్టోబర్ 28) పోస్ట్ చేస్తూ.. డాన్ లీ ఇండియన్ సినిమా ఎంట్ర...