Hyderabad, జూలై 7 -- హాలీవుడ్ స్టార్ నటి స్కార్లెట్ జాన్సన్ ప్రపంచవ్యాప్తంగా హయ్యెస్ట్ గ్రాసింగ్ యాక్టర్ గా చరిత్ర సృష్టించింది. ది ర్యాప్ రిపోర్టు ఈ విషయాన్ని వెల్లడించింది. ఆమె నటించిన తాజా మూవీ 'జురాసిక్ వరల్డ్: రీబర్త్' భారీ వసూళ్లు సాధించడంతో స్కార్లెట్ కు ఈ అరుదైన ఘనత దక్కింది. హాలీవుడ్ స్టార్ హీరోలను కూడా వెనక్కి నెట్టి ఆమె ఈ కిరీటాన్ని అందుకోవడం విశేషం.

డైనోసార్ ఫ్రాంఛైజీలోని తాజా చిత్రంలో, స్కార్లెట్ జాన్సన్ ఇంతకుముందు క్రిస్ ప్రాట్ పోషించిన పాత్ర స్థానంలోకి అడుగుపెట్టింది. ఇందులో ఆమె మాజీ సైనిక అధికారిణి జోరా బెన్నెట్ పాత్రను పోషించింది. సినిమా కథ 'జురాసిక్ వరల్డ్' తర్వాతి కాలంలో సాగుతుంది. బెన్నెట్‌ను డైనోసార్లు నివసించే చివరి ద్వీపాలలో ఒకదానికి ప్రమాదకరమైన మిషన్‌లో పంపుతారు.

ఈ చిత్రం విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప...