Hyderabad, ఆగస్టు 1 -- ప్రపంచానికి 'కొవిడ్-19' అనే పదం పరిచయం కాకముందు అంటే 2019లో, ఆడమ్ శాండ్లర్ చివరిసారిగా బాక్సాఫీస్ విజయం అందుకున్నాడు. అతని సినిమా 'అన్‌కట్ జెమ్స్' 19 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కి 50 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అప్పటి నుండి ఈ యాక్టర్, కమెడియన్ తన సినిమాల విడుదలకు ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్‌పై ఆధారపడుతున్నాడు.

ఆ తర్వాత థియేటర్లలో విడుదలైన సినిమాలు విజయం సాధించలేదు. అయినా, 2025 నాటికి చూస్తే.. నెట్‌ఫ్లిక్స్ నుండి వచ్చిన అద్భుతమైన 275 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2400 కోట్లు) డీల్‌తో అతడు ప్రపంచంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుడిగా నిలిచాడు.

ఆరేళ్లుగా ఒక్క హిట్ లేకపోయినా ఆడమ్ శాండ్లర్ ఎలా ఈ స్థాయికి చేరాడు? దీనికి కారణం 2020లో నెట్‌ఫ్లిక్స్ అతనితో నాలుగు సినిమాల కోసం ఏకంగా 275 మిలియన్ డాలర్ల డీల్‌పై సంతకం...