NEW DELHI, జూలై 25 -- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాటికి తన పదవిలో 4,078 రోజులు పూర్తి చేసుకున్నారు. తద్వారా.. 1966 జనవరి 24 నుంచి 1977 మార్చ్​ 24 వరకు ప్రధానిగా పనిచేసిన దివంగత ఇందిరా గాంధీ (వరుసగా 4,077 రోజులు) రికార్డును అధిగమించారు.

ఈ మైలురాయితో భారతదేశ చరిత్రలో వరుసగా అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రుల్లో మోదీ రెండో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మాత్రమే మోదీ కంటే ముందున్నారు.

2025 జూలై 25 నాటికి ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 4,078 రోజులు పదవిలో ఉండటంతో, ఆయన అనేక చారిత్రక ఘనతలను కూడా సొంతం చేసుకున్నారు.

మోదీ స్వాతంత్య్రానంతరం జన్మించిన మొదటి, ఏకైక ప్రధానమంత్రి (ఇప్పటివరకు).

కాంగ్రెసేతర ప్రధానుల్లో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా మోదీ నిలిచారు.

ప్రధానిగా రెండు పూర్తికాలాలు పూర్తి...