భారతదేశం, ఆగస్టు 14 -- దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్.. కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్) నిబంధనలను సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతకుముందు సేవింగ్స్​ అకౌంట్​పై పెంచిన కనీస నిల్వపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో బ్యాంక్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం.. కనీస నిల్వ మొత్తం గతంలో ప్రకటించిన దాని కంటే గణనీయంగా తగ్గింది.

బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, కొత్త నిబంధనలు ఇలా ఉన్నాయి:

పట్టణ, మెట్రో ప్రాంతాలు: ఇంతకుముందు రూ. 50,000గా ఉన్న కనీస నిల్వను ఇప్పుడు రూ. 15,000కి తగ్గించారు.

సెమీ అర్బన్​ ప్రాంతాలు: సేవింగ్స్ అకౌంట్‌లకు మినిమమ్​ బ్యాలెన్స్​ రూ. 7,500కి సవరించారు.

గ్రామీణ ప్రాంతాలు: గ్రామీణ కస్టమర్ల కోసం కనీస నెలవారీ సగటు నిల్వ (ఎంఏబీ)ని రూ. 2,500గా నిర్ణయించారు. ఇది...