భారతదేశం, జూన్ 29 -- లైంగిక ఆరోగ్యంపై అనేక అపోహలు సమాజంలో లోతుగా పాతుకుపోయి, మన అవగాహనను, అనుభవాలను ప్రభావితం చేస్తుంటాయి. మరీ ముఖ్యంగా పోర్న్​ వీడియోలు చూసి, అందులో చూపించేవే నిజం అని చాలా మంది నమ్ముతారు. తద్వారా వారి శృంగార జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఈ నేపథ్యంలోప్రముఖ సెక్సాలజిస్ట్​ డాక్టర్​ సంకల్ప్​ కుమార్​ జైన్​ లైంగిక ఆరోగ్యంపై 'అపోహలు- వాస్తవాలు' గురించి మాట్లాడారు. ప్రముఖ యూట్యూబర్​ రాజ్​ షమానీతో చేసిన పాడ్​క్యాస్ట్​లో కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు.

"లైంగిక సంబంధాలపై ప్రజలకు ఉన్న అత్యంత విధ్వంసక నమ్మకం" ఏంటి అని హోస్ట్​ అడిగిన ప్రశ్నకు.."పోర్న్ వీడియోల్లో చూసినట్లుగా మనం 30 నిమిషాల పాటు నాన్-స్టాప్‌గా లైంగిక సంబంధాలు పెట్టుకోవచ్చు అనుకోవడం," అని జవాబిచ్చారు డాక్టర్​ జైన్​.

"మీరు పోర్న్ వీడియోల్లో చూసే అన్ని పురుషాంగాలక...