భారతదేశం, మే 10 -- పెట్రోల్ బంకులు వినియోగదారులను మభ్యపెట్టడం భారతదేశం అంతటా అందరికీ తెలిసిన విషయమే. భారతదేశం అంతటా అనేక పెట్రోల్ బంకులు తమ వినియోగదారులను వివిధ మార్గాల్లో మోసం చేస్తున్నట్టు అనేక నివేదికలు బయటకు వచ్చాయి. పెట్రోల్, డీజిల్ కొనుగోలుదారులు ఈ చీటింగ్ ట్రిక్స్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండగా, నేరగాళ్లు కూడా తమ కస్టమర్లను మోసం చేయడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. చాలా పెట్రోల్ బంకులు వాల్యూమ్ కంటే ఎక్కువ డబ్బు వసూలు చేస్తూ తక్కువ ఇంధనాన్ని పంపిణీ చేయడం వంటివి వినిపిస్తూనే ఉంటున్నాయి.

పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపడానికి వెళ్లేటప్పుడు అన్నింటినీ చెక్​ చేయడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు. అయితే, అప్రమత్తంగా ఉండటం వల్ల మీరు మోసాల బారిన పడకుండా చూసుకోవచ్చు. మీ కష్టార్జితాన్ని మోసాలకు కోల్పోకుండా చూసుకోవడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో మీ కార...