భారతదేశం, ఫిబ్రవరి 5 -- ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని రోజూ పూజగదిలో దీపారాధన చేసి, ఆ తర్వాత వారికి నచ్చిన పూలతో అలంకరణ చేసి పూజ చేస్తారు. అయితే పూజకు కొన్ని పూలు పనికిరావు. ఈ పూలను పెట్టినట్లయితే ఆ పూజకు విలువ ఉండదు. అయితే మరి ఏ పూలు పూజకు పనికిరావు? పూజకు పనికిరాని పుష్పాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పూజ చేసేటప్పుడు ఈ నియమాలను కచ్చితంగా పాటించండి. పూజ చేసేటప్పుడు నేలపై పడినవి, కడగనివి, వాసన చూసిన పూలు పనికిరావు. ఈ పూలతో పూజ చేయడం వలన ఆ పూజకు విలువ ఉండదు. అలాగే ఎడమ చేతితో కోసిన పువ్వులను కూడా దేవుడికి పెట్టకూడదు. బహిష్టులైన స్త్రీలు, పురిటి మహిళలు తాకిన పూలను దేవుడికి పెట్టకూడదు. ఆ పూలతో పూజ చేయడం అస్సలు మంచిది కాదు. అలాగే వాడిపోయిన పువ్వులు, రేకులు ఊడిపోయిన పువ్వులను కూడా దేవుడికి సమర్పించకూడదు.

ఒంటిమీద ధరించి ఉన్న వస్త్రంలో కో...