భారతదేశం, మే 31 -- థాయ్​లాండ్​కి చెందిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి సోషల్​ మీడియాలో తాజాగా వైరల్​ అయ్యింది. ఓ యానిమల్​ పార్కులోని ఓ పులి.. ఓ టూరిస్ట్​పై అకస్మాత్తుగా దాడి చేసింది. పులితో అతను సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియోని చూసిన వారందరు షాక్​ అవుతున్నారు. అటవీ జంతువులతో ఇలాంటి పనులు చేస్తే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.

ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో ప్రత్యక్షమైన ఈ వీడియోలో ఒక భారతీయ టూరిస్ట్​, ఒక పులి, కర్ర పట్టుకున్న ఒక గైడ్​ కనిపిస్తున్నారు. ఆ టూరిస్ట్ మోకరిల్లి పులిని పెట్​ చేస్తూ ఫోటోకు ఫోజులు ఇవ్వడం మొదలుపెట్టాడు. కానీ అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ పులు.. అకస్మాత్తుగా అతనిపై దాడికి దిగింది. ఇదంతా వీడియోలో రికార్డు అయ్యింది. ఆ వెంటనే వీడియో కట్​ అయ్యింది కానీ, బాక్​గ్రౌండ్​లో టూరిస్ట్​ అరుపులు వి...