Hyderabad, జూలై 25 -- యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటుందన్న విషయం తెలిసిందే కదా. తన హాట్ హాట్ ఫొటోలతోపాటు ఫ్యామిలీతో గడిపిన క్షణాలను కూడా ఆమె షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు తన పిల్లలకు నలుగు పెట్టి స్నానం చేయిస్తున్న వీడియో పంచుకుంటూ.. చాలా రోజుల తర్వాత ఈ అవకాశం తనకు దక్కిందని ఆమె చెప్పింది.

అనసూయ భరద్వాజ్ శుక్రవారం (జులై 25) తన ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఆమె మంచి పల్లె వాతావరణంలాంటి పరిస్థితుల్లో తన ఇద్దరి పిల్లలకు స్నానం చేయించడం చూడొచ్చు. దీనికి ఆమె ఓ పెద్ద క్యాప్షన్ కూడా ఉంచింది. "చక్కటి వాతావరణం.. నలుగుతో స్నానం.. మన పూర్వీకులు, పెద్దలు మనల్ని ఆచరించమని కోరే వాటి వెనుక ఎన్నో అద్భుతమైన విషయాలున్నాయి. మన సంస్కృతి, సంప్రదాయం, వాటిలోని ఆచారాలు, కర్మలు.. వీటిని పాటించడంలో అపారమైన అందం, విలువ, సా...