భారతదేశం, మే 11 -- బాలీవుడ్ డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్.. తన అభిప్రాయాలను సూటిగా చెప్పేస్తుంటారు. కొన్నిసార్లు ఆయన వ్యాఖ్యలు సంచలనం అవుతుంటాయి. తాజాగా పాన్ ఇండియా సినిమా అనే కాన్సెప్ట్ గురించి అనురాగ్ మాట్లాడారు. ఈ ట్రెండ్ విపరీతంగా ఉన్న సమయంలో ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. పాన్ ఇండియా సినిమా అనేది పెద్ద స్కామ్ అని చెప్పారు. అందుకు కారణమేంటో కూడా వివరించారు.

ఇండియా అంతా సినిమా ఆడితే అది పాన్ ఇండియా అవుతుందని, కానీ అసలు తెరకెక్క ముందే పాన్ ఇండియా అని సినిమాలను పిలుస్తున్నారని అనురాగ్ కశ్యప్ అన్నారు. పాన్ ఇండియా అనేది పెద్ద మోసం అని చెప్పారు. ఈ పేరుతో వచ్చే సినిమాల్లో ఒక్క శాతం మాత్రమే సక్సెస్ అవుతున్నాయని అన్నారు.

పాన్ ఇండియా మోజులో పడడం వల్ల స్టోరీ టెల్లింగ్ తగ్గిపోయిందని అనురాగ్ కశ్యప్ అన్నారు. "బాహుబలి తర్వాత ప్రభాస్‍తో పాటు ఇతర...