భారతదేశం, మే 6 -- అనూహ్యంగా డబ్బు అవసరం వచ్చిపడటంతో పర్సనల్​ లోన్​ తీసుకోవాలని చూస్తున్నారా? పాన్​ కార్డుతో కూడా పర్సనల్​ లోన్​ పొందొచ్చని మీకు తెలుసా? పాన్​ కార్డు అంటే ఏంటి? పాన్​ కార్డుతో పర్సనల్​ లోన్​ ఎలా పొందాలి? అవసరమైన డాక్యుమెంట్లు ఏంటి? అర్హత ఏంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

పర్మనెంట్ అకౌంట్ నంబర్, లేదా పాన్ అనేది రుణదాతలకు క్రెడిట్ నమూనాకు చెందిన పూర్తి చిత్రాన్ని అందించే గుర్తింపు సంఖ్య. ఇది పౌరుల ద్రవ్య లావాదేవీలను పర్యవేక్షించడానికి సహాయపడుతుంది. చట్టపరిధికి వెలుపల జరిగే అన్ని లావాదేవీలను నిరోధిస్తుంది.

అన్ని బ్యాంకు ఖాతాలతో పాన్ కార్డ్ నంబర్​ని లింక్ చేయడం చాలా ముఖ్యం. ఇది రుణదాతలకు కేవైసీ కోసం పాన్​ని చెక్​ చేయడం మరింత సులభతరం చేస్తుంది. వ్యక్తిగత రుణం పొందడానికి పాన్ నంబర్​ని ఒక ముఖ్యమైన పత్రంగా చేస్తుంది. మనకు త...