Hyderabad, జూన్ 25 -- భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త సంబంధాల నేపథ్యంలో, పాకిస్థానీ నటులపై భారత్‌లో నిషేధం విధించాలనే డిమాండ్లు మళ్ళీ తెరపైకి వచ్చాయి. ఈ మధ్యే, పాకిస్థానీ నటీనటులతో కలిసి పనిచేసినందుకు గాను వాణీ కపూర్, దిల్జిత్ దోసాంజ్ విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే, నటి లక్ష్మీ మంచు మాత్రం ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తోంది. కళను, రాజకీయాలను వేర్వేరుగా చూడాలని ఆమె స్పష్టం చేసింది.

బాలీవుడ్‌లో ప్రస్తుతం దిల్జిత్ దోసాంజ్.. 'సర్దార్ జీ 3' సినిమాలో హానియా అమీర్‌తో కలిసి నటించినందుకు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వాణీ కపూర్ కూడా ఫవాద్ ఖాన్ తో కలిసి నటించిన 'అబీర్ గులాల్' సినిమా పహల్గాం ఉగ్రదాడి తర్వాత రిలీజ్ ఆగిపోయింది. ఈ సందర్భంగా లక్ష్మీ మంచు ఈ అంశంపై స్పందించింది.

"కళను రాజకీయం చేయొద్దు. సమస్యలు సృష్టిస్తున్న వారిని వేటాడండి. ...