భారతదేశం, మే 7 -- పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ధీటుగా బదులిచ్చింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్థాన్‍లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఉగ్రవాదులను మట్టుబెట్టింది. గతంలోనూ పాకిస్థాన్‍పై భారత సాయుధ దళాలు కొన్ని సందర్భాల్లో దాడులు చేశాయి. వీటిలో కొన్నింటి ఆధారంగా సినిమాలు తెరకెక్కాయి. పాక్‍పై భారత దళాలు చేసిన మెరుపు దాడుల ఆధారంగా రూపొందిన 4 ముఖ్యమైన చిత్రాలు ఏవో.. ఏ ఓటీటీల్లో ఉన్నాయో వివరాలివే..

ఉరిలోని ఆర్మీ హెడ్‍క్యార్టర్స్ మీద 2106లో ఉగ్రవాదులు చేసిన దాడికి బదులుగా పాకిస్థాన్‍పై భారత్ విరుచుకపడింది. పాక్ గడ్డపై అడుగుపెట్టి ఉగ్రవాదులను భారత జవాన్లు మట్టుబెట్టారు. ఇందుకోసం భారీ మిషన్ చేశారు. ఈ దాడుల ఆధారంగా 2019లో ఉరి: ది సర్జికల్ స్ట్రైక్స్ సినిమా చిత్రం వచ్చింది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషించ...