భారతదేశం, మే 5 -- పహల్గామ్​ ఉగ్రదాడిలో నేవీ అధికారి వినయ్​ నర్వాల్​ మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వినయ్​ నర్వాల్​ భార్య హిమాన్షిపై సోషల్​ మీడియాలో విపరీతమైన ట్రోల్స్​ వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రదాడి నేపథ్యంలో ముస్లింలు, కశ్మీరీలను ద్వేషించొద్దు అని ఆమె చెప్పడం ఇందుకు కారణం. ఆన్​లైన్​ ట్రోలింగ్​ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్​ హిమాన్షికి మద్దతుగా నిలిచింది. తన సిద్ధాంతాలను వ్యక్తపరిచిన ఒక మహిళను ట్రోల్ చేయడం ఏ రూపంలోనూ ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది.

ఏప్రిల్ 22న కశ్మీర్​లోని పహల్గామ్ సమీపంలో ఉన్న బైసారన్​లో 26 మందిని బలిగొన్న ఉగ్రవాద దాడికి వారం రోజుల ముందు వినయ్ నర్వాల్- హిమాన్షి వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ హనీమూన్​కు కశ్మీర్​ వెల్లగా.. ఉగ్రవాదులు నేవీ అధికారిపై కాల్పులు జరిపి చంపేశారు.

అనంతరం దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రేకెత్తాయి. ...