భారతదేశం, జూన్ 24 -- గూగుల్ పిక్సెల్ 10 సిరీస్‌ త్వరలోనే విడుదలకానుంది. గత సంవత్సరం పిక్సెల్ 9 సిరీస్ తరహాలోనే, ఈ సంవత్సరం కూడా ఆగస్టులోనే ఈ కొత్త ఫోన్‌లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. 2024లో మాదిరిగానే, ఈ ఏడాది కూడా పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో ఎక్స్​ఎల్​, థర్డ్​ జనరేషన్​ గూగుల్ ఫోల్డెబుల్ ఫోన్ - పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ - వంటి అనేక మోడల్‌లు విడుదల కానున్నాయి.

కాగా పిక్సెల్ 10 సిరీస్‌లో అనేక అప్‌గ్రేడ్‌లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నివేదికల ఆధారంగా, గూగుల్ పిక్సెల్​ 10 సిరీస్​కి సంబంధించిన వివరాలు, అంచనాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇప్పటివరకు వచ్చిన నివేదికల ప్రకారం.. గూగుల్ టీఎస్​ఎంసీకు మారడం ద్వారా ఒక ప్రధాన అప్‌గ్రేడ్‌ను తీసుకురాబోతోంది. గూగుల్ పిక్సెల్ పరికరాలు ఇప్పటివరకు శామ్‌...