Hyderabad, జూలై 3 -- పవన్ కల్యాణ్ మొత్తానికి రెండేళ్ల తర్వాత హరి హర వీరమల్లుతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జులై 24న మూవీ రిలీజ్ కానుండగా.. గురువారం (జులై 3) మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ పై మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. ఈ ట్రైలర్ పై వాళ్లు ప్రశంసల వర్షం కురిపించారు.

పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు ట్రైలర్ ఉదయం రిలీజైన విషయం తెలిసిందే. అయితే మధ్యాహ్నం తర్వాత చిరంజీవి దీనిపై తన ఎక్స్ అకౌంట్ ద్వారా స్పందించాడు. తన తమ్ముడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. రెండేళ్ల తర్వాత స్క్రీన్ పై మంట పుట్టిస్తున్నాడంటూ కామెంట్ చేశాడు.

"ఇదో ఎలక్ట్రిఫయింగ్ ట్రైలర్. సుమారు రెండేళ్ల తర్వాత కల్యాణ్ బాబు మూవీ స్క్రీన్స్ పై మంట పుట్టించడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్" అని ...