భారతదేశం, మే 22 -- ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన లైనప్‍‌లో ఉన్న సినిమాలను శరవేగంగా పూర్తి చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే హరి హర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ఓజీ మూవీ చిత్రీకరణలోనూ పాల్గొంటున్నారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి అప్‍డేట్ ఇచ్చింది. నేడు (మే 22) అఫీషియల్‍గా విషయాన్ని చెప్పింది మూవీ టీమ్.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుందంటూ మూవీ టీమ్ నేడు వెల్లడించింది. పవన్ కల్యాణ్‍కు ఇష్టదైవమైన హనుమంతుడి జయంతి అయిన ఈ అప్‍డేట్ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్. "పవర్ స్టార్ బెస్ట్‌ను సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి. హరీశ్ శంకర్ రాసి, దర్శకత్వం వహించే ఉస్తాద్ భగత్ సింగ్ ఎన్నో ఏళ్లు సెలెబ్రేట్ చేసుకునేలా, గుర్తుండిపోయేలా ఉంటుంది. షూటింగ్ త్వరలో మొదలవుతుంది. హనుమాన్ జయంతి శుభా...