Hyderabad, జూలై 1 -- తెలుగు సినిమాల్లో ఒకప్పుడు పాకీజాగా పేరుగాంచిన తమిళ నటి వాసుకి. జయలలిత పిలుపు మేరకు ఆమె ఏఐఏడీఎంకేలో చేరి అధికార ప్రతినిధి స్థాయికి చేరింది. కానీ కొన్నాళ్లుగా సంపాదించిన డబ్బంతా కోల్పోయి బిచ్చమెత్తే స్థాయికి పతనమైంది. ఇప్పుడామె పరిస్థితి తెలుసుకున్న నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆమెకు సాయం చేయడం గమనార్హం.

తెలుగు సినిమాల్లో పాకీజాగా పేరుగాంచిన నటి వాసుకి దుస్థితి తెలుసుకున్న పవన్ కల్యాణ్ ఆమెకు రూ. 2 లక్షల సాయం అందించాడు. మంగళవారం (జులై 1) మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాకీజాకు అందజేశారు.

పవన్ కల్యాణ్ చేసిన సాయానికి పాకీజా కృతజ్ఞతలు తెలిపింది. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ ఆమె భావోద్వేగానికి లోన...