Hyderabad, సెప్టెంబర్ 26 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ గురువారం (సెప్టెంబర్ 25) రిలీజై మంచి రివ్యూలు, తొలి రోజే రికార్డు బాక్సాఫీస్ కలెక్షన్లు సాధించింది. అయితే దీనిపై వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ఇచ్చిన రివ్యూ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాను తొలి రోజే చూసిన ఆయన.. గురువారం రాత్రి ట్వీట్ చేశారు.

ఓజీ మూవీకి తొలి రోజే మిక్స్‌డ్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే అంబటి రాంబాబు మాత్రం పెదవి విరిచారు. తన ప్రత్యర్థి అయినా పవన్ సినిమా హిట్ కావాలని కోరుకున్నా.. ఫలితం శూన్యం అని అనడం గమనార్హం. "ప్రత్యర్ధి అయినా పవన్ సినిమా ఆడాలని నా ఆరాటమే కానీ ఫలితం మాత్రం శూన్యం.. దానయ్య..దండగ పడ్డావయ్యా" అని ట్వీట్ చేశారు.

నిజానికి అంతకుముందు సినిమా రిలీజ్ కు ముందు కూడా ట్వీట్ చేయడం గమనార్హం. "పవన్ జి... "OG".. సూపర్ డూపర్...